Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటి వరుస స్థానాల్లో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
న్యూఢిల్లీ: దేశంలో మూడేం డ్లలో 17, 675మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. లోక్సభలో ఎంపీ కృష్ణపాల్ సింగ్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఆత్మహత్యలపై సమాచారాన్ని దేశంలో ప్రమాదకర మరణాలు, ఆత్మహత్యలు(ఏడీఎస్ఐ) పేరుతో ప్రచురించిందనీ, అయితే ఎన్సీఆర్బీ వెబ్సైట్లో 2019 వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే రైతుల ఆత్మహత్యలకు కారణాలు మాత్రం ఏడీఎస్ఐ రిపోర్టు వెల్లడించలేదని తెలిపారు. కుటుంబసమస్యలు, ఆరోగ్య సమస్యలు, మాధక ద్రవ్యాలకు బానిసలవ్వడం, వివాహ సంబంధ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, దివాలా తీయటం, రుణాలు, పరీక్షల్లో ఫెయిల్, నిరుద్యోగం, ఉద్యోగ సంబంధసమస్యలు, ఆస్తుల వివాదాలు తదితర కారణాలతో రైతులతో సహా ఇతరులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 2017లో 5,955, 2018లో 5,763, 2019లో 5,957 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనే రైతుల ఆత్మహత్యలు సంబంభించాయని మంత్రి తెలిపిన వివరాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో 7,345 మంది, కర్నాటకలో 3,853 మంది, తెలంగాణలో 2,237 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. మూడేండ్లలో ఆంధ్రప్రదేశ్లో 1,368 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.