Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజారోగ్య వ్యవస్థ అంతంత మాత్రమే..
- ఆరోగ్య సంరక్షణ కేటాయింపులు తక్కువే
- కరోనాతో కుటుంబాలపై మరింత రుణభారం
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి భారత్‌లో ఆర్థిక, ఆరోగ్య రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కరోనా కేసులు కాస్త తగ్గుముఖంతో ప్రజాజీవనం సాధారణ స్థితికి చేరుతోంది. కానీ లక్షలాది మంది భారతీయులపై భారీ వైద్య బిల్లుల భారం పడింది. దేశంలో చాలా మందికి ఆరోగ్య బీమా లేదు. వైద్యం కోసం ప్రభుత్వాలు అందించే సాయం శూన్యం కావడంతో కరోనా చికిత్స కోసం చేసిన ఖర్చుల కారణంగా కుటుంబాలు అప్పుల ఊబిలోకి జారుకున్నాయి. కరోనా చికిత్స మందులు, పరీక్షలు, ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్, అంబులెన్స్ సౌకర్యాలు ఇలా వైద్యం కోసం అనేక ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ప్రజలు రుణాల కోసం బ్యాంకులను, రుణాలు అందించే సంస్థలను, వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ''కరోనా భారత ఆర్థిక వ్యవస్థను దిగజార్చింది. దీర్ఘకాలికంగా తక్కువ నిధులు, విచ్చిన్నమైన ఆరోగ్య వ్యవస్థ కారణంగా లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం కోసం ఖర్చులు సైతం పెరిగిపోయి.. అప్పుల్లో చిక్కుకుంటున్నారు. ఇటువంటి ఖర్చులు ఆర్థిక రికవరీకి ఆటంకం కలిగిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
''అసంపూర్ణ బీమా, పేలవమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థ.. ఈ రెండు అంశాలు దేశంలో ప్రజల వైద్య ఖర్చులు పెంచాయనీ, కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆరోగ్య వ్యవస్థ లోపాలు వెలుగుచూశాయని'' ఆర్థికవేత్త వివేక్ డెహెజియా అన్నారు. కరోనా మహమ్మారి ముందు సైతం భారత్‌లో ఆరోగ్య సంరక్షణ ప్రాప్యత ఒక సమస్యగానే ఉంది. భారతీయులు తమ జేబులో లేని 63 శాతం అధికంగా వైద్య ఖర్చులకు చెల్లిస్తారు. ప్రభుత్వ సేవలు సరిపోని అనేక పేద దేశాలకంటే ఇది విలక్షణమైనది. అయితే, కరోనా నేపథ్యంలో వ్యక్తిగత వైద్య ఖర్చులకు సంబంధించిన డేటా రావటం కష్టమే కానీ భారత్‌లో చికిత్స ఖర్చులతో పాటు లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవడం మరింత భారాన్ని మోపింది. మార్చిలో ప్రచురితమైన ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం.. దాదాపు 32 మంది మిలియన్ల భారతీయులను పేదరికంలోకి నెట్టివేసింది. రోజువారి ఆదాయం రూ.120 కంటే తక్కువ ఉన్నవారి సంఖ్య 72 మిలియన్లకు పెరిగిందని అంచనా వేసింది. ''ప్రజలను పేదరికంలోకి నెట్టే రెండు అంశాలు జేబులోలేని ఆరోగ్య వ్యయం, వైద్యం కోసం చేసే విపత్కర ఖర్చులు'' అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె శ్రీనాథ్ రెడ్డి అన్నారు.
ఢిల్లీలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న తన కుమారుడు సౌరబ్ వైద్యం కోసం అనిల్ శర్మ బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. ఖర్చులు పెరగడంతో బందువులు, స్నేహితుల దగ్గర అప్పులు చేశాడు. ఓ క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్‌ను సహాయం కోసం అభ్యర్థించారు. ఇంఫాల్‌కు చెందిన డయానా ఖుమన్ థెమ్ మే లో తన తల్లి, సోదరీలను కరోనా కారణంగా కోల్పోయింది. అయితే, వైద్య ఖర్చుల కోసం కుటుంబం పొదుపులు అయిపోయాయి. ప్రయివేటు ఆస్పత్రిలో మృత దేహాలు అప్పగించకపోవడంతో తన బంగారు అభరణాలను తాకట్టు పెట్టడంతో పాటు బంధువుల దగ్గర సైతం అప్పులు తీసుకుని వైద్యం ఖర్చులు చెల్లించింది.
భారత్‌లో వైద్య ఖర్చులు ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టివేయడానికి కారణాలు అనేక ఉన్నాయి కానీ.. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రజారోగ్య వ్యవస్థ. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చేసే ఖర్చులు అంతంత మాత్రమే. దేశ జీడీపీలో 1.6 శాతం మాత్రమే ప్రజావైద్యానికి కేటాయించబడుతున్నాయి. ఇది లావోస్ లేదా ఇథియోపియాలు ఖర్చు చేసే దానికంటే తక్కువ. కరోనా విజృంభణ సమయంలో ఆస్పత్రుల్లో సదుపాయాలు, మౌలిక పరిస్థితుల కొరత స్పష్టంగా కనిపించింది. ప్రధాని మోడీ 2018లో ప్రారంభించిన ఆరోగ్య బీమా పథకం వైద్య వ్యయాల భారం తగ్గించే చర్యే అయినప్పటికీ.. ప్రాథమిక సంరక్షణ, అవుట్ పేషెంట్ ఖర్చులను కవర్ చేయదు. అలాగే, ఈ సేవలు అందరికీ అభించడం లేదు. కాబట్టి సంరక్షణ, ఆర్థిక ప్రమాద రక్షణకు ప్రాప్యతను సమర్థవంతంగా మెరుగుపర్చలేదని డ్యూక్ వర్సిటీ అధ్యయనం పేర్కొంది. దేశంలో పేలవమైన ప్రజారోగ్య వ్యవస్థ కారణంగా ప్రజలను ప్రయివేటు ఆస్పత్రుల వైపు ప్రేరేపిస్తుందని తెలిపింది.