Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే పథకం నుంచి వైదొలిగిన పలు రాష్ట్రాలు
- గడువును పాటించడంలో మరికొన్ని రాష్ట్రాలు విఫలం
- సొంత పథకాలతో ఇంకొన్ని
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కొనసాగింపు విషయంలో అనిశ్చితి నెలకొని ఉన్నది. ఇప్పటికే ఈ పథకం నుంచి పలు రాష్ట్రాలు వైదొలిగాయి. మరికొన్ని రాష్ట్రాలు టైమ్‌లైన్‌ను పాటించడంలో విఫలమవుతున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు తమ సొంత పథకాలతో ముందుకెళ్తున్నాయి.
ఇప్పటికే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలు ఈ పథకం నుంచి నిష్క్రమించాయి. మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు జూలై 25 వరకు ప్రీమియంను ఖరారు చేయలేదు. పీఎంఎఫ్‌బీవై మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ నాటికి ప్రీమియం రేట్లను నిర్ణయించాల్సి ఉన్నది. రైతుల నమోదును పూర్తి చేయడానికి ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు కేంద్రం గడువును వరుసగా జూలై 31, జూలై 23 వరకు పెంచింది. ఇక ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ల విషయంలో ఈ గడువు తేదీ జూలై 31 వరకు సమయం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఫసల్ బీమా పథకం కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం రబీ పంటలకు బీమా చేసిన మొత్తంలో 1.5శాతం, ఖరీఫ్ పంటలకు 2 శాతం, నగదు పంటలకు 5శాతంగా నిర్ణయించారు. బ్యాలెన్స్ ప్రీమియం కేంద్రం, రాష్ట్రాల మధ్య సమానంగా విభజించబడింది. చాలా రాష్ట్రాలు ప్రీమియం సీబ్సీడీలో తమ వాటాను 30 శాతం వద్ద ఉంచాలని డిమాండ్ చేశాయి. నమోదు తేదీని పొడిగించడానికి బీమా సంస్థలు తమ సమ్మతిస్తే సాధారణంగా రాష్ట్రాల అభ్యర్థనలకు కేంద్రం అంగీకరిస్తుంది. '' గతేడాది చాలా రాష్ట్రాలు బీమా సంస్థలకు స్థిర ప్రీమియంతో మూడేండ్ల ఒప్పందాన్ని ఇచ్చినందుకు కటాఫ్ తేదీలను తీర్చడంలో ఆలస్యం జరగడానికి ఎలాంటి కారణమూ లేదు'' అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కొంత ఆలస్యం కలిగించే వేరే ప్రణాళికను కలిగి ఉండాలని పట్టుబట్టాయి. నమోదు తేదీని పొడిగించాలని కోరిన రాష్ట్రాలన్నీ కోవిడ్ సంబంధిత ఇబ్బందులను గడువును తీర్చకపోవడానికి కారణమని వివరించాయి.
కొన్ని రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, బీహార్ తరహాలో తమ సొంత పథకాలను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. మరికొన్ని.. రైతులు చెల్లించే ప్రీమియం వాటాను వదులుకునే ప్రణాళికలపై చర్చిస్తున్నాయి. '' ఇటువంటి మార్పులు ఒక సాధారణ లక్షణంగా మారాయి. ఇవి గడువులను తీర్చడంలో ఆలస్యం కావడానికి కారణమవుతాయి'' అని బీమా సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. పంట బీమా పథకాన్ని పంజాబ్ ఎన్నడూ అమలు చేయకపోగా, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ సొంత పథకాలను కలిగి ఉన్నాయి. దీని కింద రైతులు ఎలాంటి ప్రీమియం చెల్లించరు. కానీ, పంట నష్టం జరిగితే వారికి నిర్ణీత మొత్తంలో పరిహారం లభిస్తుంది.