Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
బెంగళూరు : కర్నాటక 30వ ముఖ్యమంత్రిగా బుధవారం బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్గా తవార్చంద్ గెహ్లట్ ప్రమాణస్వీకారం చేయించగా, ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బొమ్మైకి ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గొప్పగా పరిపాలన చేస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, మాజీ యెడియూరప్పపై మోడీ ప్రశంసలు కురిపించారు.'మన పార్టీకి, కర్ణాటక అభివృద్ధికి యడియూరప్ప చేసిన సహకారం వర్ణించడానికి ఏ పదాలు ఎప్పటికీ న్యాయం చేయలేవు. దశాబ్దాలుగా ఆయన కష్టపడి, కర్నాటకలోని అన్ని ప్రాంతాలు పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. సాంఘిక సంక్షేమంలో తన నిబద్ధతకు ప్రశంసలు అందుకున్నారు' అని మోడీ ట్విట్ చేశారు. 'ఈ దయాపూరితమైన వ్యాఖ్యలకు కృతజ్ఞతలు' అని యడియూరప్ప సమాధానం ఇచ్చారు.