Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా తొలగించాలని డిమాండ్
- నోటీసులపై సంతకం పెట్టని మిగతా పార్టీల సభ్యులు
న్యూఢిల్లీ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ పదవి నుంచి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను తొలగించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ప్రివిలేజ్ మోహన్ ప్రవేశపెట్టారు. మంగళవారం కమిటీ సమావేశాన్ని బీజేపీ ఎంపీలు బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే బుధవారం లోక్‌సభలో ప్రివిలేజ్ మోహన్ ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానంపై బీజేపీకి చెందిన 17 మంది ఎంపీలు సంతకం చేశారు. మిగిలిన పార్టీల ఎంపీలు మాత్రం సంతకం చేయలేదు. ఈ సందర్భంగా నిషికాంత్ దుబే మీడియాతో మాట్లాడుతూ ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోని తాము ఇకపై శశిథరూర్‌ను విశ్వసించబోమని పేర్కొన్నారు. స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌ను తొలగించడానికి ఎలాంటి నిబంధనలు లేవని తెలిపారు.
మరోవైపు పెగాసస్ నిఘాపై ప్రభుత్వ అధికారులను ప్రశ్నించేందుకుగాను బుధవారం జరగాల్సిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం కోరం లేక వాయిదాపడింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అధ్యక్షతన సమాచార, సాంకేతిక పరిజ్ఞాన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పార్లమెంటులో 'పౌరుల భద్రత, డేటా రక్షణ' గురించి చర్చించినట్టు తెలిపారు. అయితే సమావేశ గదికి హాజరైన ప్యానెల్ బీజేపీ సభ్యులు నిరసనగా హాజరు రిజిస్టర్లో సంతకం చేయలేదు. ఇది సమావేశాన్ని నిర్వహించడానికి అవసరమైన కోరం లేకపోవటానికి దారితీసింది.
షెడ్యూల్ ప్రకారం పెగాసస్ నిఘా వ్యవహారంపై కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులతో స్థాయీ సంఘం చర్చించాల్సి ఉంది. భేటీకి హాజరు కావాలని అధికారులకు కమిటీ సమన్లు కూడా పంపింది. అయితే అధికారులు గైర్హాజరయ్యారు. కేవలం తొమ్మిది మంది బీజేపీ ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ప్రొసీడింగ్స్ జరగాలంటే కనీసం 10 మంది ఎంపీలు హాజరుకావాల్సి ఉంది. హౌం మంత్రిత్వ శాఖ అధికారులు కూడా కమిటీతో భేటీకి హాజరుకాలేదు.