Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభలో కేంద్ర సమాధానం
న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిం చిన లఢక్, కాశ్మీర్లను మళ్లీ కలిపి రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రహోం మంత్రిత్వశాఖ ప్రకటిం చింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న సమయం లో ఆ ప్రకటన విడుదల చేస్తామని తెలి పింది. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్న కు రాజ్యసభలో హోంశాఖ సహాయ మంత్రి నిత్యా నంద్ రారు బుధవారం రాతపూర్వక సమా ధానం ఇచ్చారు. 2019 ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న370, 35ఏ అధికరణల ను కొట్టివేశారు. వాటిని రాజ్యాంగం నుంచి తొల గించి జమ్మూకాశ్మీర్, లఢక్‌లను కేంద్ర పాలిత ప్రాం తాలుగా చేసిన విషయం తెలిసిందే. బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర జమ్మూకశ్మీర్‌లో భద్రతా చర్యలపై ప్రశ్న వేశారు. రెండూ ప్రశ్నలకు కలిపి మంత్రి సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదుల దాడులు తగ్గు ముఖం పట్టాయని తెలిపారు. 2020లో 59శాతం ఉంటే జూన్2021 వరకు 32శాతానికి తగ్గిపో యిందని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేం దుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నా యని తెలిపారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపై నిరంతర నిఘా పెట్టినట్టు చెప్పారు. లోయలో కశ్మీరీ పండితుల పునరా వాసం.. భద్రతపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 900 కశ్మీరీ పండిత్, డోగ్రా హిందూ కుటుంబాలు కాశ్మీర్లో ఉన్నాయని వెల్లడించారు.