Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : వరకట్నం, మహిళలపై వేధిం పుల కేసులను విచారించటానికి ప్రత్యేక కోర్టులు ఏర్పా టు చేస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. వరకట్న నిరో ధక చట్టాలను ఎంతగా పటిష్టం చేసినా విద్యావం తులు కూడా కట్నం ఇవ్వడం, తీసుకోవడంలో భాగమవుతున్నారని తెలిపారు. వరకట్నం, మహిళలపై వేధింపుల కేసులు విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వీటి కోసం కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. 2011-16 కాలంలో వరకట్నం వేధింపులతో 100 హత్యలు లేదా ఆత్మహత్యలు జరిగాయని ఎంఎల్ఎ ఎన్ఎ నెల్లిక్కున్ను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 2016 నుంచి 2021 వరకూ ఇలాంటివి 54 జరిగాయని చెప్పారు. ఇలాంటి మరణాలు ఒక్కటి కూడా సంభవించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ముఖ్యమంత్రి విజయన్ స్పష్టం చేశారు. విద్యాధికులు కూడా వరకట్న కేసుల్లో భాగస్వామిగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ వ్యక్తి కూడా కట్నం ఇవ్వకుండా, తీసుకోకుండా సమాజం మైండ్సెట్ మారాలని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్ తరాలకు వీటిపై అవగాహన కలిగే విధంగా పాఠశాల పాఠ్యపుస్తకాల్లో వీటికి సంబంధించిన చట్టాలపై పాఠాలు ఉండాలని విజయన్ తెలిపారు.