Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోరు వానలో కిసాన్ సంసద్
- కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టంపై చర్చ
- ఇది అప్రజాస్వామం, రాజ్యంగం విరుద్ధం
- కిసాన్ సంసద్‌లో రైతులు స్పష్టం
న్యూఢిల్లీ: ఎడతెరిపివ్వకుండా కురుస్తున్నా.. మడ మతిప్పకుండా అన్నదాతలు ఉద్యమిస్తున్నారు. ఎండ,చలి,వాన, తుఫాన్లు వచ్చినా అదరం..బెదరం అంటూ ఢిల్లీ సరిహద్దుల్లో దీక్ష చేస్తున్నారు. దశలవారీగా దీక్షకు మద్దతు లభిస్తున్నది. చిన్నా,పెద్దా అనే తేడాలేకుండా దీక్ష జరుగుతున్న ప్రాంతానికి తరలివచ్చి సంఘీభావం తెలుపుతూనే ఉన్నారు. మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. బుధవారం జంతర్ మంతర్‌లో కిసాన్ సంసద్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ పై చర్చ జరిగింది. ఇది అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమని రైతులు స్పష్టం చేశారు. బుధవారం మూడు సెషన్లు జరిగాయి. మొదటి సెషన్‌కు నరేంద్ర సింగ్ (బీహార్), అవతార్ సింగ్ మెహ్మా(పంజాబ్), రెండో సెషన్‌కు తాజేంద్ర సింగ్ బాల్ (పశ్చిమ బెంగాల్), అమర్జిత్ సింగ్ మహ్లా (పంజాబ్), మూడో సెషన్‌కు శ్రద్ధానంద్ సోలంకి (హర్యానా), లవ్‌ప్రీత్ సింగ్ ఫెరోక్ (పంజాబ్) స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లగా వ్యవహరించారు. చర్చలో పాల్గొన్న అనేక మంది రైతులు కాంట్రాక్ట్ వ్యవసాయంతో తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. కార్పొరేట్ వ్యవసాయం, వనరులను సంపాదించడం గురించి కేంద్ర చట్టం ఎలా ఉందో వారు మాట్లాడారు.భవిష్యత్‌లో ఉద్యమాన్ని ఉధృతం చేసేదిశగా కార్యాచరణతో ముందడుగు వేస్తున్నారు.