Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇజ్రాయిల్ పై విచారణకు పలు దేశాల అనుమతి
- సమాధానం చెప్పటానికి మోడీసర్కార్ నిరాకరణ
- ఏకమవుతున్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : పెగాసస్ అక్రమాలపై మోడీ సర్కార్ నోరుమెదపటంలేదు. ఇజ్రాయిల్ సంస్థ అయిన ఎన్ఎస్ఎం గుట్టురట్టవటంతో..కాళ్ల బేరానికి వస్తున్నది. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడైన మక్రాన్‌పై కూడా పెగాసస్ ప్రయోగం చేశారన్న వాస్తవాలు వెలుగుచూశాయి. అక్కడ ప్రకంపనలు సృష్టించాక..ఫ్రాన్స్ ముందు ఇజ్రాయిల్ చేతులు జోడించి మరీ ప్రాధేయపడుతున్నది. ఆస్ట్రియా లాంటి చిన్న దేశాలు కూడా పెగాసస్ పై విచారణకు అనుమతించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి మూలస్థంభంగా కొలిచే భారత్ పైనే పెగాసస్ దాడికి పాల్పడింది. ఇంతకీ దేశానికి వ్యతిరేకంగా పెగాసస్ ను ఎవరు ప్రయోగించారు.?సాధారణంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా..దేశద్రోహులకు వ్యతిరేకంగా ఆ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే ప్రజాస్వామ్యంపైనే దాడి అన్నట్టుగా..కీలక రాజకీయపార్టీల నేతలు,జర్నలిస్టులు, న్యాయమూర్తులతో పాటు ప్రముఖులందరీ ఫోన్లను ట్యాప్ చేసింది. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో దేశాన్నే టార్గెట్ చేస్తే...మోడీ సర్కార్ మాత్రం మౌనంగా ఉండటంపై పలు అనుమానాలకు తావిస్తున్నది. పార్లమెంట్‌ను బుల్డోజ్ చేసి..బిల్లుల్ని పాస్ చేయించుకుంటున్న బీజేపీ ప్రభుత్వం. పెగాసస్ అంశం.. రాద్ధాంతంగా మారినా..సమాధానమివ్వ కుండా కేంద్రం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నది. ఇపుడు దీనిపై 60 శాతం మంది దేశప్రజలు ప్రాతినిధ్యం వహించే ఎంపీలంతా పార్టీలకతీతంగా ఒక్కటయ్యారు. ఫోన్ ట్యాపింగ్ గుట్టువిప్పాల్సిందేనంటూ వారు మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆల్జిరియా లాంటి చిన్న దేశాలు పెగాసస్ పై విచారణకు ఆదేశిస్తుంటే..భారత్ ఎందుకు అలా ధైర్యం చేయలేకపోతున్నదని ప్రశ్నిస్తున్నారు. పెగాసస్ ను కేంద్రమే కొనుగోలు చేసి ఉండాలి. లేదా కేంద్రం అనుమతితోనే ఓ సంస్థ ఖరీదు చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పెగాసస్ గుట్టు విప్పటానికి మోడీ ప్రభు త్వం నిరాకరిస్తున్నదని ప్రజాసంఘాలు,ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.