Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో పిపికె న్యూస్‌క్లిక్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థకు ఉన్న మధ్యంతర రక్షణను ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 2 వరకు పొడిగించింది. అప్పటి వరకు ఆయనపై ఎటువంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని న్యాయస్థానం గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులను ఆదేశించింది. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు(ఇసిఐఆర్)ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను జస్టిస్ ముక్తా గుప్తా వాయిదా వేశారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూస్‌క్లిక్ పోర్టల్ కార్యాలయంతో పాటు ఎడిటర్ నివాసంలో సోదాలు నిర్వహించారు. 26 శాతం ఎఫ్‌డిఐ పరిమితిని ఉల్లంఘిస్తూ పిపికె న్యూస్‌క్లిక్ స్టూడియో ప్రై.లిమిటెడ్ అధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) పొందిందనేది ఇడి ఆరోపణ. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన ఇడి పలు ప్రాంతాల్లో సోదాలు కూడా చేపట్టింది.