Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో 42.7 శాతం మందిలో యాంటీబాడీలు
- ఐసీఎంఆర్ సెరో సర్వే వెల్లడి
న్యూఢిల్లీ: స్థానికంగా నెలకొన్న కరోనా పరిస్థితులను తెలుసుకోవడానికి జిల్లా స్థాయి సెరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా దానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. దేశంలోని 70 జిల్లాల్లో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇటీవల నిర్వహించిన జాతీయ సెరో సర్వే వివరాలను సైతం కేంద్రం వెల్లడించింది.
ఆ వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సరాసరిగా 67.6 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయి. అంటే సెరో సర్వే గణాంకాల ప్రకారం ఇవ్పటివరకు దేశంలో 80 కోట్ల మందికి కరోనా సోకిందని అర్థం. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 79 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది. అత్యల్పంగా కేరళలో 42.7 శాతం మందిలో మాత్రమే యంటీబాడీలు ఉన్నాయి. అంటే ఇక్కడ సగం జనాభాకు కూడా వైరస్ ఇంకా సోకలేదని తెలుస్తోంది. ఇక కరోనా కేసులు అధికంగా నమోదైన మహారాష్ట్రలో 58 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు.