Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్, బెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఆగస్టు 1 వరకు దేశంలోని చాలా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తాజాగా దీనికి సంబంధించిన 15 రాష్ట్రాలకు హెచ్చరికలు సైతం జారీ చేసింది. ఇందులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, బెంగాల్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, గోవా వంటి రాష్ట్రాలు ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 386.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుర్గావ్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.