Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్, ఐసీఎంఆర్లు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ అనుమతిని బ్రెజిల్ రద్దు చేసింది. ఈ మేరకు టీకా అత్యవసరంగా వాడేందుకు అనుమతిని నిషేధిస్తున్నట్టు బ్రెజిల్ జాతీయ ఆరోగ్య నిఘా సంస్థ తెలిపింది. భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ టీకా అందించేందుకు ఆ దేశంలోని 'ప్రిసిసా మెడికమెంటోస్'తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఇటీవల రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. టీకా అనుమతులు తీసుకునేందుకు ఆ దేశ ఔషధ నియంత్రణ సంస్థ అయిన 'అన్విసా'తో కలిసి పని చేస్తామని పేర్కొంది. ఈ క్రమంలోనే బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకున్నది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి అనుమతి నిలిపివేసే నిర్ణయం బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా తీసుకున్నట్టు బ్రెజిల్ జాతీయ ఆరోగ్య పర్యవేక్షణ సంస్థ అన్విసా ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, టీకాల కొనుగోలు వ్యవహారం బ్రెజిల్లో వివాదాస్పదమవడంతో టీకా సరఫరా ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగాన్ని బ్రెజిల్ నిషేధించడంతో.. కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సైతం నిలిచిపోయాయి.