Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) మాజీ ప్రధానకార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ 13వ వర్థంతి సందర్భంగా చండిగఢ్‌లో నిర్వహించిన సభలో సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ప్రసంగించారు. లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర భారత్‌ను పరిరక్షించుకునేందుకు ప్రజలంతా సంఘటితం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తుత్తునియలు చేయాలని కోరారు. సమ సమాజ నిర్మాణ దిశగా పోరాటాలను ఉధృతం చేయాలన్నారు.