Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తర్వాత ఎల్ఐసీలో వాటాల విక్రయం
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాల ఉపసంహరణపై మోడీ సర్కార్ చాలా ఉత్సు కతతో ఉంది. అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో వాటాలను విక్రయించక ముందే మరో మూడు పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్ మెంట్ చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్దేశించుకుందని తెలుస్తోంది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమి టెడ్, మిశ్ర దాతు నిగమ్ లిమిటెడ్, రాష్ట్రీయా కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమి టెడ్‌లో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్దతిలో వాటాలను విక్రయించనున్న ట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒక్కరు తెలిపారు. వచ్చే అక్టోబర్‌తో ప్రారంభమయ్యే త్రైమాసికంలో డిజిన్వెస్ట్‌మెంట్ చేపట్టే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది ప్రారం భంలో ఎల్ఐసిలో పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియ ఉండొచ్చన్నారు. అంతకుముందే ఈ మూడు పిఎస్‌యుల్లో వాటాల విక్రయం ఉంటుందన్నారు. ఎల్ఐసీ డిజిన్వెస్ట్మెంట్కు ఇటీవలే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీపీఈఏ) ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్ఐసీలో రూ.1-1.5 లక్షల కోట్ల విలువ చేసే వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎయిరిండియా, బీపీసీఎల్ సంస్థలను పూర్తిగా ప్రయివేటుపరం చేసే పనిలో బీజేపీ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే.నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో 20 శాతం వాటాను విక్రయించే యోచనలో కేంద్రం ఉంది. దీంతో ఇందులో కేంద్ర వాటా 74 శాతానికి పడిపోనుంది. రాష్ట్రీయా కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, మిధానీలో 10 శాతం చొప్పున వాటాలను ఉపసంహరించుకోవడం ద్వారా ఈ పీఎస్‌యూల్లో సర్కార్ వాటా వరుసగా 75 శాతం, 74 శాతానికి తగ్గనుంది. ఈ వారం ప్రారంభంలో హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో)లో ఓఎఫ్ఎస్ ద్వారా 8 శాతం వాటాను విక్రయించింది. దీంతో కేంద్రానికి రూ.7,646 కోట్ల నిధులు సమకూరాయి. ఎన్ఎండీసీ ఓఎఫ్ఎస్ ద్వారా మరో రూ.3,651 కోట్లు, యాక్సిస్ బ్యాంక్‌లోని ఎస్‌యూయూటీఐ వాటా విక్రయం ద్వారా రూ.3,994 కోట్లు చొప్పున కేంద్రం తన ఖజానాలో వేసుకుంది. కాగా.. ఈ మొత్తం విలువ చేసే వాటాలు మార్కెట్ శక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో పలు పీఎస్‌యూల్లోని వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు రాబట్టుకోవాలని మోడీ సర్కార్ బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకుంది.
738 కోట్ల ఏఐ ఆస్తుల అమ్మకం
ప్రభుత్వ రంగంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ)కి చెందిన పలు ఆస్తులను విక్రయించినట్టు కేంద్రం వెల్లడించింది. 2015 నుంచి ఇప్పటి వరకు రూ.738 కోట్ల విలువ చేసే 115 ఆస్తులను అమ్మినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వికె సింగ్ గురువారం పార్లమెంట్‌కు లిఖితపూర్వకంగా తెలిపారు. దేశంలోని మరో 106 ఆస్తులతో పాటుగా విదేశాల్లోని ఐదు ఆస్తులను అమ్మకానికి పెడుతున్నామని వెల్లడించారు.