Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలఫిరంగులు, లాఠీచార్జ్
- బీహార్‌లో పోలీసుల జులం
పాట్నా : గౌరవ వేతనం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ డిమాండ్‌తో అసెంబ్లీ వైపు ర్యాలీ చేస్తున్న పంచాయతీ వార్డు కార్యదర్శలపై బీహార్ పోలీసులు జల ఫిరంగులు, లాఠీచార్జ్‌తో విరుచుకుపడ్డారు. మహిళలతో సహా నిరసనకారులందరిపైనా విచక్షణారహితంగా దాడికి పాల్ప్డడ్డారు. దీంతో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది భయంతో పరుగులు తీసారు. తమ డిమాండ్లు నేరవేర్చమని ప్రభుత్వాన్ని నిలదీసే లక్ష్యంతో కార్యదర్శులు గురువారం గాంధీ మైదాన్ నుంచి అసెంబ్లీ మార్చ్ నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే ర్యాలీ ప్రారంభమైన కొద్ది సేపటికే పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాదనకు దిగారు. ముందుగా కార్యదర్శులపై జలఫిరంగులు ప్రయోగించిన పోలీసులు తరువాత లాఠీచార్జ్‌కు దిగారు. కార్యదర్శులపై పోలీసుల దాడిని వామపక్ష పార్టీలతో సహా ప్రతిపక్ష మహాఘట్‌బంద్ నేతలంతా తీవ్రంగా ఖండించారు.