Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది వృద్ధి 6 శాతమే: ఐఎంఎఫ్
- ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆందోళనకరం: మూడీస్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలను డెల్టా వేరియంట్ భయాందోళనలకు గురిచేస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా నివేదక ఈ ఏడాది(2021)లో ప్రపంచ ఆర్థిక వృద్ధిని 6 శాతంగా అంచనా వేసింది. మూడో వేవ్ ప్రభావం ఎక్కువగా లేకపోతే.. రికవరీ పరుగులు పెడుతుందంటూ అంచనా వేసింది. అయితే, ఇప్పటికే కరోనా వైరస్ విసిరిన అనేక సవాళ్ల నేపథ్యంలో వృద్ధి రికవరీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వివిధ దేశాల్లో సెంకండ్ వేవ్ కల్లోలం రేపగా.. ప్రస్తుతం థర్డ్‌వేవ్ పంజా విసురుతూ.. ఇప్పట్లో కోలుకునే పరస్థితులను దెబ్బతీస్తోంది. ఇలాంటి పరిస్థితుల ఉండగా.. ఐఎంఎఫ్ నివేదిక వృద్ధి అంచానాలపై అనేక సందేహాలు వ్యక్త మవుతున్నాయి. మరీ ముఖ్యంగా డెల్టా వేరియంట్ పంజా విసురుతుండగా.. ఆర్థిక వృద్ధి, రికవరీ మెరుగుపడుతుందనడం ఆశ్చర్యం కలిగించే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కరోనాపై పైచేయి సాధించలేదు. మున్ముందు మరింతగా విరుచుకుపడే (డెల్టా వేరియంట్) అవకాశముందని అంచానాలున్నాయి. అమెరికా సహా పలు యూరప్ దేశాలు ఇదిరకటి కంటే మెరుగైన వృద్ధిని నమోదుచేసే అవకాశాలున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది. చైనా సైతం ప్రస్తుతం మెరుగ్గానే ముందకు సాగుతోంది. అక్కడ ఈ ఏడాది 8.1 శాతానికి పరిమితం అంవుతుందనీ, వచ్చే ఏడాది (2022)లో జీడీపీ 5.7 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. భారత వృద్ధి రేటు అంచనాలను 2021-22 ఆర్థిక సంవత్సరానికి 12.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. సెకండ్ వేవ్ కారణంగా దేశంలో వృద్ధి రికవరీ నెమ్మదిగా జరుగుతుందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది.
భారత ఎకానమీపై సెకండ్ వేవ్ సవాళ్లు : మూడీస్
భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ ప్రభావం కారణంగా తలెత్తిన సవాళ్లు మరికొంత కాలంపాటు కొనసాగుతాయని ఆర్థిక రేటింగ్ సంస్థ మూడీస్ పేర్కొంది. మూడీస్ విడుదల చేసిన తాజా 'ఆసియా పసిఫిక్ ఎకనమిక్ అవుట్‌లుక్: ది డెల్టా రోడ్‌బ్లాక్' నివేదికలో.. కరోనా ఆంక్షలు ప్రస్తుత త్రైమాసికంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంది. డెల్టా వేరియంట్ ఆసియా పసిఫిక్ దేశాల్లో భయాందోళనలు కలిగిస్తున్నదని తెలిపింది. అయితే, 2020తో పోల్చితే ఆర్థిక నష్టం ప్రస్తుతం కాస్త తక్కువగా ఉండే అవకాశముందని తెలిపింది. ఆర్థిక రికవరీ సైతం ఏ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నట్టు అంచనా వేసింది. వ్యాక్సినేషన్ భారత ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుందనీ, దీనిని వేగవంతం చేయాల్సిన అవసరముందని నొక్కి చెప్పింది.