Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి : థర్డ్‌వేవ్ కరోనా కేసులపై పరిశోధకులు
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్-19 ఇన్ఫె క్షన్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులు తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కానీ, ఈఏడాది అక్టోబర్‌లో అవి గరిష్టస్థా యికి చేరుకునే అవకాశంఉన్నది. ఈఏడా ది ప్రారంభంలో తీవ్రమైన కేసుల పెరుగుదల ను కచ్చితంగా అంచనావేసిన పరిశోధకుల గణిత నమూనా థర్డ్‌వేవ్‌పై ఈ విషయాన్ని వెల్లడించింది. ఐఐటీ హైదరాబాద్, కాన్పూర్ లకు చెందిన మతుకుమల్లి విద్యాసాగర్, మణింద్ర అగర్వాల్ ల నేతృత్వంలోని పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మరింత తీవ్రమవుతున్నది. రోజుకు లక్ష నుంచి 1.50 లక్షల కంటే తక్కువ కేసులతో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. సెకండ్ వేవ్‌లో మే 7న నమోదైన కేసుల (రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు)తో పోల్చుకుంటే రాబోయే వేవ్‌లో కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అయితే, భారత్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంత చేయాల్సిన అవసరం ఉన్నదని అధ్యయనం తేల్చి చెప్పింది. కొత్త హాట్స్పాట్లను గుర్తించడానికి నిఘా పద్దతులను అమలు చేయాలనీ, కొత్త వేరియంట్లు వెలువడే అవకాశం ఉన్నందున జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా అప్రమత్తంగా ఉండాలని నొక్కి చెప్పింది. ప్రస్తుతం డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న విషయం విదితమే. గత అక్టోబర్‌లో ఈ వేరియంట్ భారత్‌లో మొదటిసారిగా గుర్తించిన విషయం తెలిసిందే.