Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదవీకాలం పూర్తికాకముందే ముగ్గురు బయటకు..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయమైన 'పీఎంఓ'లో సలహాదారుగా పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి రాజీనామా చేశారు. ప్రధాని కార్యాలయంలో సామాజిక సంబంధాల వ్యవహా రాలను చూస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి అమర్జీత్ సిన్హా తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.అయితే తన పదవీకాలం ఇంకా ఏడు నెలలు మిగిలి ఉండగానే ఆయన రాజీనామా చేయ టం ఢిల్లీ అధికారిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీహార్ క్యాడర్‌కు చెందిన అమర్జీత్ సిన్హా 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2019లో గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత 2020 ఫిబ్రవరిలో రెండేండ్లపాటు పీఎంఓ సలహాదారుగా నియమితులయ్యారు.గతంలో ప్రధాని మోడీకి ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న నృపేంద్ర మిశ్రా 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజీనామా చేసి వెళ్లిపోయారు.పీఎంఓలో ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా పనిచేసిన మాజీ క్యబినెట్ కార్యదర్శి పి.కె.సిన్హా ఈఏడాది మార్చిలో రాజీనామా చేశారు. ఆయన వెళ్లిపోయిన కొన్ని నెలల్లోనే అమర్జీత్ కూడా తన పదవికి గుడ్‌బై చెప్పడం అధికార వర్గాల్లో చర్చనీయా ంశమైంది. అమర్జీత్ తన రాజీనామాకు కారణాలను మాత్రం పేర్కొనలేదని సమాచారం.
ప్రధాని కార్యాల యంలో అత్యంత కీలక విభాగాల్ని చూస్తున్న పలువు రు అధికారులు తమ పదవీకాలం ముగియకుండానే రాజీనామా చేసి వెళ్లిపోవటం వార్తల్లో నిలిచింది.మార్చిలో రాజీనామా చేసిన పి.కె.సిన్హా విషయానికొస్తే, ఆయన పీఎంఓలో ఓఎస్డీగా నియమితుల య్యారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సెప్టెంబరు 2019లో ఆయన కోసం ఒక ప్రత్యేకంగా ఒక పోస్ట్ (ప్రిన్సిపల్ అడ్వైజర్)ను సృష్టించి పి.కె.సిన్హాను తీసుకొచ్చారు. దీనికంటే ముందు ఆయన కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శిగా ఉండేవారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పి.కె.సిన్హా అటు యూపీఏ, ఇటు ఎన్డీయే ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేశారు.