Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నితీష్ కుమార్
పాట్నా : ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ కుంభకోణంపై పట్టుబడుతున్న ప్రతిపక్షాలతో బిజెపి మిత్రుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ జతకలిశారు. పెగాసస్‌పై విచారణ చేయాల్సిందేనని చెప్పారు. 'గత కొన్ని రోజులుగా టెలిఫోన్ ట్యాపింగ్ గురించి చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి, వేధించడానికి ఇలాంటి పనులు చేయకూడదు. మొత్తం విషయాన్ని బహిరంగపరచాలి' అని నితీష్‌కుమార్ సోమవారం మీడియాతో అన్నారు. ఈ విషయంపై విచారణ చేయాలా? అని విలేకరుల ప్రశ్నించగా, 'ఇది జరగాలి' అని నితీష్ సమాధానం ఇచ్చారు.