Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో:విద్యుత్ సవరణ బిల్లు-20 21ను వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యుత్‌రంగ ఉద్యోగులు, ఇంజనీర్లు నాలుగు రోజుల పాటు 'సత్యాగ్రహం' చేపట్టనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లును ఆమోదించాలని కేంద్రం ఏకపక్షంగా నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్, ఇంజనీర్స్ (ఎన్సీసీఓఈఈఈ) పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగులు సత్యాగ్రహం నిర్వహిస్తారని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మెన్ శైలేంద్ర దూబే తెలిపారు. ఉత్తర ప్రాంత పరిధికి చెందిన ఉద్యోగులు ఈ నెల 3న, తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు చెందిన వారు 4న, పశ్చిమ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు 5న, దక్షిణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు 6న ఈ ఆందోళనల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ విద్యుత్ బిల్లులోని అనేక నిబంధనలు ప్రజలకు, ఉద్యోగులకు వ్యతిరేకమైనవని, వీటిని అమలు చేస్తే ప్రతికూల ఫలితాలు ఎదుర్కోక తప్పదని అన్నారు.