Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్టోబరు 2019 నుంచి మార్చి 2021 వరకూ పప్పుల ధరలు పెరుగుతూ వస్తు న్నాయి. వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ)లో గణాంకాలు పరిశీలిస్తే పప్పుల ధరలు ఏవిధంగా పెరుగుతున్నాయో తెలుసు కోవచ్చు. పప్పుల ఉత్పత్తిలో, వాడకంలో భారత్ అతిపెద్ద దేశం. గత నాలుగేండ్లుగా వీటి ధరలు పెరగటమేగానీ తగ్గిన దాఖలా లేదు. పప్పు దినుసుల దిగుబడి భారీగా ఉన్నా...ధరలు తగ్గటం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 26 మిలియన్ మెట్రిక్ టన్నుల(ఎంఎంటీ) పప్పులు దేశంలో ఉత్పత్తి అయ్యాయి. ఇందులో 12.6 ఎంఎంటీల శెనగపప్పు, 4.1 ఎంఎంటీల కందిపప్పు, 2.6 ఎంఎంటీల పెసరపప్పు, 2.4 ఎంఎంటీల మినపప్పు ఉత్పత్తి అయ్యింది. కేంద్ర వ్యవసాయశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత ఏడాదితో పోల్చితే ఉత్పత్తి గణనీయంగా నమోదైంది. మరోవైపు విదేశాల నుంచి దిగుమతులూ ఉన్నాయి. అయినా..మార్కెట్లో పప్పుల ధరలు రెండింతలయ్యాయి.