Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత ఆర్మీకి చెందిన ఓ హెలికాఫ్టర్ కథువా జిల్లాలోని రంజిత్సాగర్ డ్యామ్ సరస్సు సమీపంలో కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టాయి.అయితే ఈ ప్రమాద సమయంలో హెలికా ఫ్టర్ లో ఇద్దరు పైలట్లు ఉన్నట్టు తెలుస్తోంది. వారిద్దరూ క్షేమంగా ఉన్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. సాధారణ శిక్షణ నిమిత్తం పంజాబ్ లోని పఠాన్కోట్ నుంచి బయల్దేరిన ఈ విమానం కథువా ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.