Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కనీస మద్దదు ధర (ఎంఎస్పి) అన్ని పంటలకు, రైతులందరికీ చట్టబద్ధంగా హామీ ఇచ్చే హక్కును కల్పించడానికి ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలని కిసాన్ సంసద్ (రైతు పార్లమెంట్) డిమాండ్ చేసింది. ఈ మేరకు కిసాన్ సంసద్ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. మంగళవారం జరిగిన కిసాన్ సంసద్‌లో మూడు సెషన్లు జరగగా, మొదటి సెషన్ కావల్ప్రీత్ సింగ్ పన్ను(పంజాబ్), దిల్బాగ్ సింగ్ హుడా (హర్యానా), రెండో సెషన్‌కు సాహిబ్ సింగ్ (హర్యానా), ఫర్మాన్ సింగ్సంధు (పంజాబ్), మూడో సెషన్‌కు హర్జీందర్ సింగ్ తండా (పంజాబ్), పశ్య పద్మ (తెలంగాణ) స్పీకర్, డిప్యూటీ స్పీక ర్లగా వ్యవహరించారు. ''ఎన్‌సిఆర్ మరియు పరిసర ప్రాంతా లలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్'' బిల్లులో రైతులపై జరిమానా నిబంధనలను తొలగించాలని తీర్మానం చేశారు.
కిసాన్ సంసద్‌లో తెలంగాణ ప్రతినిధి బందం
ఢిల్లీలో జులై 22 నుండి పార్లమెంటు ఎదురుగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ''కిసాన్ సంసద్''లో మంగళవారం తెలంగాణ నుండి పలు రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ)లో భాగంగా 17 మంది ప్రతినిధుల బృందం పాల్గొన్నారు.