Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో మాసంలోనూ అంతంతే..
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సేవల రంగ కార్యకలాపాలు వరుసగా మూడో మాసం లోనూ మందగించాయి. కరోనా, లాక్డౌన్ నిబంధ నలతో జులైలో ఈరంగం నెమ్మదించింది. గడిచిన మాసంలో ఐహెచ్ఎస్ మార్కిట్ నెలవారీ సర్వే నివేదిక ప్రకారం.. ఈ రంగం పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 45,4గా నమోదైంది. జూన్లో ఇది 41.2తో పోలిస్తే కాస్త పుంజుకున్నప్పటికీ.. పీఎంఐ సూచీ 50పాయింట్ల ఎగువన చోటు చేసు కుంటేనే వృద్థిపథంలో ఉన్నట్టు. 50 పాయింట్ల లోపు ఉంటే క్షీణతను సూచిస్తుంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డిమాండ్ సన్నగిల్లిందని ఐహెచ్ఎన్ మార్కెట్ ప్రతినిధి బీమా పేర్కొన్నారు. వ్యాపారాలు, ఉత్పత్తి, ఉద్యోగాలు పడిపోయాయ న్నారు. అంతర్జాతీయంగానూ సేవారంగంలో డిమాండ్ పడిపోయిం దని పేర్కొన్నారు. వినియోగదారుల సేవలు భారీగా దెబ్బతిన్నా యని... ఒక్క రవాణా, నిల్వ రంగాలు మాత్రం కొంత రాణించాయ న్నారు. మరోవైపు నిర్వహణ, పెట్టుబడి వ్యయాలు పెరిగిపోయా యని ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వే వెల్లడించింది. ఇంధనం, వైద్య పరి కరాలు, ముడిపదార్ధాల ధరలు జులైలోనూ పెరిగాయని పేర్కొంది. రానున్న 12 నెలల పాటు సేవారంగంలో ఒడుదొడుకులు కొనసాగ నున్నాయన్న అంచనాల నేపథ్యంలోనే కొత్త ఉద్యోగుల్ని తీసుకోవ డానికి సంస్థలు ముందుకు రావడం లేదని అంచనా వేసింది.