Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీసీఏ నుంచి ఎన్ఓసీ
న్యూఢిల్లీ : ప్రముఖ మార్కెట్ విశ్లేషకుడు, ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ప్రారంభించనున్న 'ఆకాశ్ ఎయిర్' విమానయాన సేవలు ఈ ఏడాది డిసెంబర్ వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సంస్థ పౌర విమానయాన సేవలకు డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి నిరభ్యంతర దృవీకరణ పత్రం (ఎన్ఓసీ) జారీ అయ్యింది. కాగా.. ఎయిర్ ఆపరేటర్ పర్మిట్ కోసం ముందుగా కొన్ని విమానాలను తీసుకోనుంది. సంస్థలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 35 మిలియన్ డాలర్ల అంటే 40 శాతం వాటా మేరకు పెట్టుబడి పెట్టనున్నారు. మిగిలిన వాటాను ఎయిర్బిఎన్బి, పార్ క్యాపిటల్ మేనేజ్మెంట్లు తీసుకోనున్నాయి. తొలి దశలో 70 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ఇది వరకు రాకేష్ ఝుంఝున్వాలా పేర్కొన్న విషయం తెలిసిందే.