Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంయుక్త కిసాన్ మోర్చా
న్యూఢిల్లీ : రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లుకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీలపై కిసాన్ సంయుక్త మోర్చా (ఎస్కేఎం) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు గురువారం ఎస్కేఎం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్లమెంట్ సభ్యులకు జారీ చేసిన పీపుల్స్ విప్‌ను ఎస్కేఎం గమనిస్తున్నదనీ, కొన్ని పార్టీల ఎంపీలు విప్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నారని విమర్శించింది. బీజేడీ, టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ, జేడీయూ, ఏఐఏడీఎంకే వంటి పార్టీలు వివిధ బిల్లులపై చర్చల్లో పాల్గొని, రైతులకు వ్యతిరేకంగా వ్యవహారించారని తెలిపింది.