Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు ప్రధాన పార్టీల కంటే ఎక్కువ : ఏడీఆర్
- బీజేపీకి మూడు రెట్లు విరాళాలు
- ఐదు ప్రధాన పార్టీల కంటే ఎక్కువ : ఏడీఆర్ నివేదిక
న్యూఢిల్లీ : కేంద్రంలోని అధికార బీజేపీకి.. దేశంలోని ఐదు ప్రధాన పార్టీల కంటే మూడు రెట్లు అధిక విరాళాలు అందాయి. ఈ మేరకు బీజేపీ ప్రకటించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడైంది. కాంగ్రెస్, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీఎంసీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), సీపీఐ, సీపీఐ(ఎం) వంటి ఐదు ప్రధాన జాతీయ పార్టీలకు అందిన విరాళాల కంటే మూడు రెట్లు బీజేపీకి అందడం గమనార్హం. ఈ నివేదిక ప్రకారం.. '' బీజేపీ ప్రకటించిన విరాళాలు కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఐ(ఎం), టీఎంసీ లు ప్రకటించిన మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ. బీజేపీ ప్రకటించిన విరాళాల మొత్తం రూ. 785.77 కోట్లు. కాగా, మిగతా పార్టీలు ప్రకటించిన మొత్తం రూ. 228.035 కోట్లుగా ఉన్నది'' అని వెల్లడైంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి రాజకీయ పార్టీలు సమర్పించిన సమాచారం ఆధారంగా రూ. 20వేల కంటే ఎక్కువ విరాళాలు అందుకున్న పార్టీలపై ఏడీఆర్ దృష్టి సారించింది.