Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుషులతో పోలిస్తే మహిళలకు తక్కువశాతం వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ : దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి థర్డ్‌వేవ్ వైపు దూసుకెళ్తున్నది. ఇటు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నామని కేంద్రం చెప్పుకుంటున్నది. అయితే, ప్రతి రంగంలో ఉన్నట్టుగానే ఈ టీకా డ్రైవ్‌లోనూ దేశంలో లింగ అసమానత జాఢ్యం నెలకొని ఉన్నది. మహిళలు అధిక సంఖ్యలో టీకాలు పొందలేకపోతున్నారు. పురుషులతో పోల్చుకుంటే వారు వెనకబడి ఉండటం ఆందోళన కలిగిస్తున్నదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, గతంలో ఉన్న ఈ అసమానత ప్రస్తుతం కొంత తగ్గిపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లోనే ఈ విషయం వెల్లడైంది.
ఈ సమాచారం ప్రకారం.. వ్యాక్సినేషన్‌ను పొందే విషయంలో జూన్ నెలలో పురుషులు ముందున్నారు. మహిళల కంటే 17 శాతం ఎక్కువ డోసులను పురుషులు పొందగలిగారు. అయితే, అది ప్రస్తుతం నాలుగు శాతం తగ్గింది. ఇప్పుడు పురుషులు.. మహిళల కంటే 13 శాతం ఎక్కువ డోసులను పొందారు. కిందటి నెల డేటాతో పోలిస్తే లింగ అసమానత తగ్గినట్టు కనిపించినప్పటికీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితులు ఇంతకు మించి కఠినంగా ఉండే అవకాశాలున్నాయని వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఆరోపించారు. భారత్‌లో అధికారికంగా జూలైలో మాత్రమే గర్భిణీలకు టీకాలు వేయడం ప్రారంభించారు. వారికి వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడానికి చేపట్టిన కార్యక్రమాలు కొంత లాభం చేకూర్చాయనీ, ఫలితంగానే లింగ అసమానత తగ్గడానికి కారణమైందని నిపుణులు తెలిపారు.