Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విన్నవించేందుకు వెళ్లిన కార్మిక నేతలపై పోలీసుల ప్రతాపం
- సీపీఐ(ఎం) కార్పొరేటర్ గంగారావు సహా పలువురు అరెస్టు
విశాఖ :కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఉక్కు కార్మికుల నిరసన సెగ తగిలింది. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన నిమిత్తం ఆమె శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయొద్దంటూ కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు సీపీఐ(ఎం) 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్యారాం సహా పలువురు నేతలు అంతకు ముందే సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జాతీయ రహదారి నుంచి ఎయిర్ పోర్టు లోపలకు వెళ్ళటానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మిక నాయకులు జాతీయ రహదారిపై బైఠాయిం చారు. పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చేపడే శారు. వారిని అరెస్టు చేసి పెందుర్తి స్టేషన్‌కు తరలించారు. డాక్టర్ గంగారావు, అయోధ్యరామ్, ఉక్కు కార్మిక నేతలు ఎన్.రామారావు, కెఎం.శ్రీనివాస్, శ్రీనివాస రాజు, రామస్వామి, వెంకటేశ్వర్లు సహా 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తులపై విడు దల చేశారు. ఎయిర్ పోర్టు వద్ద అంతా క్లియర్ అయిన తర్వాతే కేంద్ర మంత్రి ఎయిర్‌పోర్టు నుంచి పోర్టు గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. అంతకుముందు స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) ప్రధాన కార్యదర్శి నమ్మి రమణను పెదగంట్యాడలో పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు.