Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ (సవరణ) బిల్లు ఉపసంహరించుకోవాల్సిందే : కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
- సమాఖ్యవిధానానికి వ్యతిరేకం
తిరువనంతపురం : విద్యుత్ సవరణ బిల్లు-2021ను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. కేరళ అసెంబ్లీ గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పార్లమెంటులో ప్రతిపాదించిన బిల్లుపై ఆ రాష్ట్ర విద్యుత్‌శాఖామంత్రి కె.కృష్ణన్‌కుట్టి సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టబోయే ముందు మంత్రి మాట్లాడుతూ 'ఈ బిల్లు ద్వారా రాష్ట్రాలకు, విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు ఎటువంటి హక్కులూ ఉండవు. అన్ని హక్కులూ కేంద్రం చేతుల్లోకి వెళతాయి. కేంద్రం చెప్పినట్లే.. రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాల్సి ఉంటుంది. కేంద్రం విద్యుత్ రంగంలోకి ప్రయివేటు కంపెనీలను ఆహ్వానిస్తుంది. ఆ కంపెనీలు ప్రత్యేకించి కొత్త లైన్లు వేయడానికి కానీ, నిర్వహణకు కానీ.. ప్రత్యేకించి పెట్టుబడి పెట్టవు. ఉన్న లైన్ల ద్వారానే విద్యుత్‌ను తీసుకుని లాభాలను ఆర్జిస్తాయి. ఒకవేళ ఆ కంపెనీలు అనుకున్నంత లాభం రాకపోతే నిర్దాక్షిణ్యంగా విద్యుత్‌ను నిలిపివేస్తాయి.