Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉంటే పనులు ఎలా ఉంటాయో తెలిపేందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇది. మూడేండ్ల క్రితం (2018లో) కేరళను భీకరమైన వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ప్రాథమిక, కుటుంబ ఆరోగ్య కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిని వీలైనంత వేగంగా పునర్నిర్మాణం జరపాలని అక్కడి ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిర్ణయించి...అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఆనాడు వరదలకు దెబ్బతిన్న ఆరోగ్య కేంద్రాల్ని కేరళ సీఎం పినరరు విజయన్ ఇటీవల ప్రారంభించారు. ప్రజలకు అత్యంత అధునాతన ఆరోగ్య సేవలు అందించే కుటుంబ ఆరోగ్య కేంద్రాల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా విజయన్ ప్రకటించారు. కేరళ ప్రజా ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న మరికొన్ని నూతన కుటుంబ ఆరోగ్య కేంద్రాలు, హెల్త్, వెల్నెస్ కేంద్రాల్ని ఆయన ప్రారంభించారు.2018లో భారీ వర్షాలు, వరదలు కేరళను ముంచెత్తాయి. అనేక జిల్లాలు నీటమునిగాయి. అందులో మలప్పురం జిల్లా ఒకటి. ఆ జిల్లాలో వజక్కాడ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. వరదల తాకిడికి పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఆరోగ్య కేంద్రాల పునర్నిర్మాణం కోసం ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. వజక్కాడలోని పీహెచ్సీని కుటుంబ ఆరోగ్య కేంద్రంగా అప్గ్రేడ్ చేస్తూ నూతన భవనాన్ని నిర్మించింది. అత్యంత అధునాతన వైద్య సామగ్రిని అందజేసింది. 1500 చదరపు అడుగల విస్తీర్ణంలో ఈ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. వరద తాకిడికి గురైన ఆరోగ్య కేంద్రాల పునర్నిర్మాణం, ఆధునీకరణ పనుల్ని అత్యంత తక్కువ సమయంలో పూర్తిచేయటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
సంక్షోభంలోనూ..కోతల్లేవ్
కేరళ ఆర్థికమంత్రి కె.ఎన్.బాలగోపాలన్
తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తినా..ప్రభుత్వ వ్యయంలో కోతలు విధించలేదు.గత వందేండ్లలో చవిచూడని సంక్షోభాన్ని రాష్ట్రం ఎదుర్కొంటోంది.అయినప్పటికీ సంక్షేమం,అభివృద్ధిపైప్రభుత్వ వ్యయం తగ్గల ేదు.సరికొత్త ప్రమాణాల్ని పాటిస్తూ పలు కార్యక్రమాల్ని అమలుజేశాం. ప్రజల జీవనోపాధిని కాపాడాలని,ర్థిక కార్యకలాపాలు ఆగకూడదని మా ఉద్దేశం.