Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌లోని ఎన్ఎస్ఓ గ్రూపుకు చెందిన పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవహారం భారత్‌నే కాదూ..ఇతర దేశాలనూ కుదిపేస్తున్నది. పలు దేశాల్లోని నేతలు,జర్నలిస్టులపైఈ స్పైవేర్‌తో నిఘా పెట్టినట్టు వార్తలొ స్తున్న విషయం తెలిసిందే.కాగా,ఈ నిఘా బారిన పడ్డ ఏడు దేశాలకు చెందిన 17మంది జర్నలిస్టులు ఎన్ఎస్ఓ గ్రూపుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రిపోర్ట్ విత్ అవుట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్)తో చేతులు కలిపారు. ఈ సంస్థపైపారిస్లోని ప్రాసిక్యూటర్లకు ఫిర్యాదుచేశారు. తమ కేసును పరిశీలిం చాలని ఆర్ఎస్ఎఫ్ ఐరాసకు సూచించింది. జులై 20న ఆర్ఎస్ఎఫ్, మరో ఇద్దరు మోరోకాన్-ఫ్రెంచ్ జర్నలిస్టులు..పారిస్ ప్రాసిక్యూటర్లకు ఫిర్యాదు చేశారు.జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని వేధించిన బాధ్యులను గుర్తించాలని కోరింది.ఈ 17మంది జర్నలిస్టుల్లో ఇద్దరు అజర్ బైజాన్, ఐదుగురు మెక్సి కో,భారత్‌కు చెందిన ఐదుగురు,హంగేరీ నుంచి ఇద్దరు, స్పెయి న్,మోరాకో,టోగో నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.భారత్ నుంచి ది వైర్ వ్యవస్థాపకులు సిద్దార్థ్ వరదరాజన్, ఎంకె వేణు, సీనియర్ జర్నలిస్ట్ సుశాంత్ సింగ్, భారత్‌లో ఆర్ఎస్ఎఫ్ కరస్పాండెంట్ సుభ్రాంశు చౌదరి, ఆర్ఎస్ఎస్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ పొందిన స్వాతి చతుర్వేది ఫిర్యాదులు దాఖలు చేశారు.