Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్ఎంఎం జాతీయ కార్యదర్శి వి శ్రీనివాసరావు
న్యూఢిల్లీ : ఒలింపిక్స్‌లో పోరాడిన మహిళా హాకీ జట్టు సభ్యురాలు వందన కటారియాను కించపరిచేలా వ్యాఖ్యలుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత శోషన్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) డిమాండ్ చేసింది. ఆమెను, ఆమె కుటుంబంపై కుల దూషణలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. వందన కటారియా ఇంటి వద్ద అవమానకరంగా డాన్సులు చేసి ఎగతాళి చేశారనీ, ఆ దుండగులపై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం టీమ్‌లోనే అత్యంత ప్రతిభావంతంగా ఆడిన అమ్మాయి వందన కటారియాని తెలిపారు. కేవలం దళిత క్రీడాకారిని అన్న కారణంతో ఓటమికి ఆమెను బాధ్యురాలను చేసి ఉత్తరాఖండ్‌లోని ఆమె ఇంటి వద్ద అగ్రకుల చాందసవాదులు గొడవ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.