Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖలో నిరసనల హోరు
విశాఖ : కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గో బ్యాక్ అంటూ..విశాఖలో వామపక్ష, కార్మిక సంఘాలు శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వద్దనీ,కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గో బ్యాక్ అంటూ..అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేతలు ఆందోళన నిర్వహించారు.నిర్మల సీతారామన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి ఉక్కు కార్మికుల నిరసన సెగ తాకిన విషయం తెలిసిందే.స్టీల్‌ప్లాంట్ ప్రయివే టీకరణ వద్దు అంటూ..ఆమెకు వినతిపత్రాన్ని ఇవ్వడానికి వెళ్లిన వామప క్ష,కార్మిక నేతలను పోలీసులు అడ్డుకొని బలవంతపు అరెస్టులు చేశారు.