Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరిద్వార్‌లో ఐదు ల్యాబ్‌లపై ఈడీ దాడులు
- ఫేక్ బిల్లులతో అక్రమాలు జరిగాయి : ఈడీ ప్రకటన
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్‌లో హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాకు సంబంధించి కోవిడ్ టెస్టుల కుంభకోణంపై ఈడీ దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. కుంభమేళాకు హాజరుగానీ భక్తుల పేర్లు, ఫోన్ నెంబర్లతో హరిద్వార్‌లో కోవిడ్ ల్యాబ్‌లు ఫేక్ బిల్లులు రూపొందించాయని ఈడీ దాడుల్లో బయటపడింది. కుంభమేళాకు సంబంధించి కోవిడ్ టెస్టుల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కోవిడ్ పరీక్షలు చేయకుండానే చేసినట్టు హరిద్వార్ జిల్లాలో(ఉత్తరాఖండ్) ఐదు కోవిడ్ ల్యాబ్‌లు బిల్లులు రూపొందించగా, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వాటికి చెల్లించిందని ఆరోపణలు న్నాయి.ఆ ల్యాబ్‌లపై తాజాగా ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు జరపగా, బోగస్ బిల్లుల వ్యవహారం బయటపడింది.ఈ ఏడాది ఏప్రిల్ 1-30 మధ్య గంగానదికి కుంభమేళా జరగగా...నదీ సాన్నానికి భక్తులు పెద్ద సంఖ్యలో హరిద్వార్‌కు వచ్చారు. భారత్‌లో రెండో వేవ్ ఉధృతంగా ఉన్నవేళ ఈ కుంభమేళాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతివ్వటం వివాదాస్పదమైంది. వైద్య నిపుణులు, సామాజికవేత్తలు ప్రభుత్వతీరును తప్పుబట్టారు. దీనినుంచి తప్పించుకోవడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం, కుంభమేళాకు హాజరైన భక్తులకు కోవిడ్ చేస్తున్నాం, నెగిటీవ్ వచ్చినవారినే అనుమతిస్తున్నామని తన చర్యల్ని సమర్థించుకుంది. ఈ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.ఈడీ దాడుల్లో అధికారులు గుర్తించిన విషయాలు మీడియాకు వెల్లడించారు. ''ప్రాథమికంగా రూ.3.4కోట్ల రూపాయలు ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి కోవిడ్ టెస్టుల ల్యాబ్‌లకు అందాయి. కోవిడ్ టెస్టులు చేయకుండానే..చేసినట్టు బిల్లులు రూపొందించినట్టు మా విచారణలో తేలింది. విచిత్రమైన సంగతేంటంటే..కుంభమేళాకు హాజరుకాని వారికి కోవిడ్ పరీక్షలు జరిపామని ఈ ల్యాబ్‌లు బిల్లులు వసూలు చేశాయి. అంతేగాక పాజిటివిటీ రేటును తక్కువ చేసి చూపే ప్రయత్నం ల్యాబ్‌లు చేశాయి. వాస్తవంగా పాజిటివిటీ 5.3శాతం ఉంటే, ఈ ల్యాబ్‌లు 0.18శాతం నమోదుచేశాయి. తప్పుడు మొబైల్ నెంబర్లు, ఒకే ఫోన్ నెంబర్‌పై వందలాది మందికి టెస్టులు..ఇలాంటి అవకతవకలు అనేకమున్నాయి. ఇవన్నీ ఫేక్ కోవిడ్ టెస్టులే''నని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.