Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకుల ఆర్థిక విధానాలకు..కరోనా సంక్షోభం తోడైంది : ఆర్థిక విశ్లేషకులు
- ఒక ఏడాదిలో కార్మికశక్తి కోల్పోయిన ఆదాయం రూ.13లక్షల కోట్లు!
- ఇంటివద్ద ఖాళీగా ఉన్నవారిని నిరుద్యోగులుగా లెక్కించటం లేదు..
నేడు దేశంలో కోట్లాదిమందిని వేధిస్తున్న సమస్య ఉపాధి. కరోనా సంక్షోభం రాకముందే దేశంలో పరిస్థితులు క్రమంగా క్షీణించటం మొదలైంది. కరోనా సంక్షోభం, లాక్డౌన్(2020లో) వల్ల భారతదేశంలో కార్మికశక్తి కోల్పోయిన ఆదాయం రూ.4.12లక్షల కోట్లు ఉంటుందని ఒక అంచనా. ప్రయివేటు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, స్వయం ఉపాధి పనులు చేసుకునేవారు...ఎంతోమంది ఆదాయాన్ని కోల్పోయారు. కరోనా కారణంగా ఒక ఏడాదిలో కార్మికశక్తి కోల్పోయిన ఆదాయం సుమారుగా రూ.13లక్షల కోట్లు ఉంటుందని ఒక ఆర్థిక సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. - ఆర్థికవేత్త జయన్ జే థామస్
న్యూఢిల్లీ : గత కొన్నేండ్లుగా కేంద్రం అమలుజేస్తున్న ఆర్థిక విధానాలు, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో చేసిన తప్పులు నేటి దేశ ఆర్థిక పత నానికి దారితీశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో ప్రస్తు తం ఉపాధిరంగం అత్యంత దయనీయ స్థితిలో ఉంది. దీనికితోడు ఉన్న ఉద్యోగాల్లో చాలామందికి మునపటి స్థాయిలో వేతనాలు రావటం లేదు. వెరసి కోట్లాదిమంది ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. ఉపాధి, నిరు ద్యోగంపై తాజాగా విడుదలైన గణాంకాల్లోనే సంక్షోభ తీవ్రత స్పష్టంగా కన పడుతోంది. కరోనా సంక్షోభం మొదలుకాక ముందు ఉపాధి గణాంకాలతో పోల్చిచూస్తే ఇప్పుడు పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది.
పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా..
జనవరి 2020లో దేశ జనాభాలో ఉపాధివున్నవారు 42.9శాతం (సీఎంఐ ఈ డాటా). ఇది జులై 2021నాటికి 40.2శాతానికి పడిపోయింది. కరోనా సమయంలో ఉన్న పళంగా ఉపాధి కోల్పోయినవారు దాదాపు 1.3కోట్ల మంది ఉంటారని సీఎంఐఈ డాటా చెబుతోంది. జనవరి 2018 గణాంకాలతో పోల్చిచూస్తే.. దాదాపు 1.5కోట్లమంది పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థలో వారికి ఉపాధి దొరకలేదు. కరోనాలో ఉపాధి కోల్పోయినవారికి వీరు అదనం. నిత్యం జనాభా పెరుగుతున్న ఈ దేశంలో, వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్లో ఇలాంటి గణాంకాలు నమోదుకావటం ఆందోళన కరమని నిపుణులు భావిస్తున్నారు.
కరోనా రాకముందే ఆర్థిక పతనం
కరోనా సంక్షోభం రాకముందే దేశంలో ఉపాధి సంక్షోభం ప్రారంభమైందని ఆర్థిక విశ్లేషకులు కొంత మంది చెబుతున్నారు. జనవరి 2019-జనవరి 2020 మధ్యకాలంలో ఉపాధి పొందేవారి సంఖ్య గణనీయంగా పడిపోయిందని గణాంకాలు నమోద య్యాయి. నిరుద్యోగుల సంఖ్యను, కార్మికుల సంఖ్యను తెలియజేసే కార్మికశక్తిలో ప్రాతినిథ్యరేటు కరోనాకు ముందు నుంచీ తగ్గుతూ వస్తోంది. సీఎంఐఈ గణాంకాల ప్రకారం జనవరి 2018లో నిరుద్యోగ రేటు 5శాతం ఉండగా, జనవరి 2020నాటికి 7.2 శాతానికి పెరిగింది. లాక్డౌన్ సమయం(ఏప్రిల్-మే 2020)లో 23.5శాతానికి చేరుకుంది. జులై 2021నాటికి నిరుద్యోగరేటు సుమారుగా 7శాతం ఉందని తెలిపింది. అయితే గత ఏడాది లాక్డౌన్ తర్వాత నిరుద్యోగరేటు 23.5 నుంచి 8శాతానికి చేరుకోగా, కార్మికశక్తిలో ప్రాతినిథ్యరేటు మాత్రం పెరగలేదు. కోట్లాదిమంది ఉపాధి కోల్పోయి ఖాళీగా ఇంటివద్ద ఉన్నవారిని అనేక సర్వేలు నిరుద్యోగులుగా గుర్తించలేదని, దానివల్ల నిరుద్యోగరేటుపై సరైన గణాంకాలు రాలేదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
అప్పులే దిక్కు..
లాక్డౌన్, కరోనా దెబ్బకు కోట్లాది కుటుంబాలు ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల్లో ఇది స్పష్టంగా కనప డింది. ప్రజల పొదుపు అనూహ్యంగా పడిపోయి, వారు అప్పుల చేసి రోజులు వెళ్లదీస్తున్నారని తేలింది. ఆహారంపై ప్రజల వ్యయం తగ్గిందని మరికొన్ని అధ్యయనాలు తెలిపాయి. జులైలో ఖరీఫ్ పనులు ఉంటాయి కాబట్టి ఉపాధిరంగం మెరుగుపడిందని భావించడానికి వీల్లేదు. ఇది తాత్కాలిక పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు. వేతన ఉద్యోగాల్లో, తయారీ, నిర్మాణరంగంలో కార్మికుల సంఖ్య కోట్లల్లో పడిపోయింది. అంతేకాదు శాశ్వత ఉద్యోగాల సంఖ్య పెద్ద సంఖ్యలో పడిపోయాయి.