Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ హైకోర్టు వద్దకు వెళ్లేందుకు రాజధాని రైతుల యత్నం
- మహిళలు, రైతుల నిలువరించేందుకు పోలీసుల తోపులాట
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో పోలీసుల నిర్బంధ చర్యలు కొనసాగాయి. రాజధాని రైతులు దీక్షలు మొదలుపెట్టి ఆది వారానికి 600వ రోజుకు చేరాయి. అమరావతి ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు హైకోర్టు వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన రాజధాని ప్రాంత రైతులు, మహిళల ను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో మందడం, వెంకటపాలెం లో ఉద్రిక్తత నెలకొంది. వెంకటపాలెంలో రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం తో గ్రామస్థులు నిరసన తెలిపారు. గ్రామంలోని రోడ్లను దిగ్బంధించారు. మరోవైపు మందడంలో రైతులు, మహిళలను పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. భద్రతా బలగాల నుంచి తప్పించుకుని హైకోర్టు వద్దకు చేరుకున్న 15 మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.