Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మరాఠీ భాషకు శాస్త్రీయ హోదా కల్పించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభకు సోమవారం సమాచారం ఇచ్చారు. బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. ఈ అంశంపై చర్చించేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, సంస్కృతం, కన్నడ, మలయాళం, ఒడియా బాషలకు శాస్త్రీయ హోదా ఉందన్నారు. మరాఠీ భాషకు కూడా ఈ హోదా కల్పించంలో ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వెళుతుందని చెప్పారు. ఒక భాషకు శాస్త్రీయ హోదా కల్పించాలంటే, దానికి 1500-2000 సంవత్సరాల చరిత్ర కలిగిఉండడంతో పాటు ప్రాచీన సాహిత్యం, సాహిత్య సంప్రదాయం అసలైనదిగా, ఇతర కమ్యూనిటీల నుంచి స్వీకరించనదిగా ఉండాలన్న ప్రమాణాలను ప్రభుత్వం ఆమోదించింది.