Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాబోయే శతాబ్దాలు కోలుకోలేని విధంగా ఉంటాయి : యూఎన్ నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నివేదిక ఒక స్పష్టమైన హెచ్చరికలను జారీ చేసింది. ఇది భూగ్రహంపై మానవులు తీసుకొస్తున్న తిరోగమన మార్పుల గురించి వివరించింది. ఈ నివేదికను 195 సభ్య దేశాలు ఆమోదించాయి. '' ఈ నివేదిక రియాలిటీ చెక్'' అని ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) వర్కింగ్ గ్రూప్ ఐ కో-చైర్ వాలెరీ మాసన్-డెల్మోట్టే అన్నారు.
ప్రపంచంలోని ప్రముఖ వాతారణ శాస్త్రవేత్తలు తీవత్రరమవుతున్న వాతావరణ ఎమర్జెన్సీ గురించి గట్టి హెచ్చరికను అందించారు. ఈ మార్పులు రాబోయే శతాబ్దాలు కోలుకోలేని విధంగా ఉంటాయని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీ సెల్సియస్ లేదా 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేస్తే వచ్చే రెండు దశాబ్దాలలో ఈ మార్పులు అంత వేగంగా ఉండగపోవచ్చని ఈ నివేదిక వెల్లడించింది. గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల తగ్గింపులను ఇది సూచించింది. 1.5 డిగ్రీల సెల్సియస్ థ్రెషోల్డ్ స్థాయికి మించి ఉంటే వాతావరణ వ్యవస్థలో కోలుకోలేని మార్పును సూచిస్తాయని వివరించింది. గ్లోబల్‌వార్మింగ్ 2 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి తీవ్రతలు తరచుగా వ్యవసాయం, ఆరోగ్యం విషయంలో క్లిష్టమైన పరిమితులను చేరుకుంటాయని పేర్కొన్నది. కాగా, ఈ నివేదికను '' మానవత్వానికి సంకేతం'' అని యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ వివరించారు. '' శిలాజ ఇంధనాల అధిక వినియోగం, అటవీ నిర్మూలన, గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలతో భూగ్రహం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఫలితంగా కోట్ల మంది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయి'' అని గుటెర్రస్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాహనాల వినియోగం, వంట చెరుకు వినియోగం, గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని వాతావరణ శాస్త్రవేత్తలు సూచించారు.
అలాగే, ఆయా దేశాల ప్రభుత్వాలు ఈ విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకొని వాటిని అమలయ్యేలా చూడాలని వాతావరణవేత్తలు తెలిపారు. వాతావరణ మార్పు, ఫలితంగా భూగ్రహంపై పడుతున్న ప్రభావం వంటి విషయాలను రాబోయే తరాలకు తెలియజేసేలా పాఠ్యాంశాలలో బోధించాల్సిన అవసరం ఉన్నదన్నారు.