Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్లలో 21,910 కేసులు నమోదు
- 17,939 కేసుల్లో చార్జిషీట్ దాఖలు
దేశంలో గిరిజనులపై నేరాలు, లైంగికదాడులు పెరుగుతున్నాయి. గత మూడేం డ్లలో దేశవ్యాప్తంగా 21,910 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం లోక్సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. షెడ్యూల్డుతెగల(ఎస్టీలు)పై నేరాలు, లైంగికదాడులను నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిస్తున్నదనీ, దాని ప్రకారం 2017-2019 మధ్య ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం కేసులు వివరాలు ఇలా ఉన్నాయి. 2017లో 7,125, 2018లో 6,528 2019లో 8,257 కేసులు నమోదయ్యాయి. మొత్తం 21,910 కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. 2017లో 5,818, 2018లో 5,619, 2019లో 6,502 కేసులకు చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 17,939 కేసులకు చార్జిషీట్ దాఖలు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. 2017లో 744, 2018లో 503, 2019లో 742 కేసుల్లో దోషులను నిర్ధారించడం జరిగింది. మొత్తం 1,989 కేసుల్లో దోషులను గుర్తించినట్టు తెలిపారు. 2017లో 10,661, 2018లో 9,726లో 2019లో 11,091 మందిని అరెస్టు చేశారు. మొత్తం 31,478 మందిని అరెస్టు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. 2017లో 10,035, 2018లో 10,261, 2019లో 12,342 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 32,638 మందిపై ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు చెప్పారు. 2017లో 1,015, 2018లో 761, 2019లో 1,149 మందిని దోషులుగా నిర్ధారించడం జరిగింది. మూడేండ్లలో మొత్తం 2,925 మందిని దోషులుగా నిర్ధారించినట్టు మంత్రి తెలిపారు.