Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1,19,53,758 కోట్ల కేంద్రం అప్పులు
- జీడీపీలో 60.5 శాతం రుణాలే : కేంద్ర మంత్రి నిర్మలా
న్యూఢిల్లీ : దేశం అప్పులభారతమైంది. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సగానికి ఎక్కువ అప్పులే ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ. రూ.1,19,53,758 కోట్లు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశ అప్పులు జీడీపీలో 60.5 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. సోమవారం లోక్సభలో ఎంపీ సాజిదా అహ్మద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2020-21లో ప్రభుత్వం రుణం రూ.1,02,67,043 కోట్లు ఉన్నది. అది జీడీపీలో 52 శాతంగా ఉన్నది. అందులో విదేశీ రుణం రూ. 6,83,677 కోట్లు కాగా, అది జీడీపీలో 3.5 శాతంగా ఉన్నది. స్వదేశీ రుణం రూ.95,83,366 కోట్లు కాగా, అది జీడీపీలో 48.5 శాతంగా ఉన్నది. అలాగే ఇతర ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకున్న రుణం రూ.16,86,715 కోట్లు కాగా, అది జీడీపీలో 8.5 శాతంగా ఉన్నది. దేశంలో మొత్తం జీడీపీ రూ. 1,97,45,670 కోట్లు కాగా, అందులో 1,19,53,758 కోట్లు అప్పులు ఉన్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అప్పులు మొత్తం జీడీపీలో 60.5 శాతంగా ఉన్నదని ఆమె తెలిపారు.