Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగుమతుల్లో వృద్ధి 67శాతం
- భారత్-చైనా వాణిజ్యంపై ప్రభావం చూపని ఆత్మనిర్భర్, గాల్వాన్ ఘటన
న్యూఢిల్లీ : భారత్-చైనా మధ్య సంబంధాలు మునపటిలా లేవన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితి.. వాణిజ్యంపై ప్రభావం చూపలేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది(2020)తో పోల్చితే ఈ ఏడాదిలో(జనవరి-జూన్) చైనా నుంచి దిగుమతులు భారీగా పెరిగాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, టెలికాం పరిక రాలు, కంప్యూటర్ హార్డ్‌వేర్, పరిశ్రమల్లో వాడే భారీ యంత్రాలు మొదలైనవి చైనా నుంచి భారత్‌కు పెద్ద మొత్తంలో దిగుమతయ్యాయి. దిగుమతుల్లో వృద్ధి 67శాతం నమోదైందని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలే చెబుతున్నాయి. చైనా ఉత్పత్తులకు అమెరికా తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ నిలిచిం దని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. గత ఏడాది గాల్వాన్ ఘర్ష ణ తర్వాత భారత్-చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనా ఉత్ప త్తులేవీ కొనుగోలు చేయరాదని, దిగుమతులపై ఆంక్షలు విధించాలని మోడీ సర్కార్ భావించింది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారం భించిం ది. అయితే ఇవేవీ తదనంతర కాలంలో భారత్-చైనా వాణిజ్యంపై ప్రభావం చూపలేదని తెలుస్తోంది. కేంద్ర వాణిజ్యశాఖ, చైనా ప్రభుత్వ ట్రేడ్ ఏజెన్సీలు విడుదల చేసిన సమాచారం ప్రకారం, భారత్ నుంచి చైనాకు ఎగుమతుల వాటా కూడాపెరిగింది. 2019-20లో భారతదేశ ఎగుమతు ల్లో 5.3శాతం చైనాకుజరగగా, 2020-21లో అది7.3శాతానికి పెరిగింది. అలాగే భారతదేశ దిగు మతుల్లో చైనావాటా కూడాపెరిగింది. 2019- 20లో 13.7శాతం ఉండగా, 2020-21లో 16.6శాతంనమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో లాక్డౌన్లు అమలయ్యాయని, దాంతో ఇతర దేశాల దిగుమతులు భారత్‌కు తగ్గాయని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు.