Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్విట్ ఇండియా డే సందర్భంగా
- మోడీ సర్కారు విధానాలపై ప్రజాగ్రహం..
- దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ఆందోళన
న్యూఢిల్లీ : మోడీ హటావో...దేశ్ బచావో అంటూ దేశవ్యాప్తంగా లక్షలాది గొంతులు నినదించాయి. క్విట్ ఇండియా వార్షికోత్సవం సందర్భంగా ఏఐకేఎస్, సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. మోడీ సర్కార్ హటావో, కార్పొరేట్ లూట్ బంద్ కరో, దేశ్ బచావో నినాదాలతో లక్షలాది మంది ప్రజలు దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. సోమవారం 'మోడీ సర్కార్ హటావో, దేశ్ బచావో' నినాదంతో దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లోని వందలాది జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలను సమీకరణ జరిగింది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఆందోళనలు నిర్వహించాయి.
''మూడు వ్యవసాయ చట్టాలు, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి, సీ2ం50 శాతం వద్ద ఎంఎస్పీకి హామీ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలి. కార్పొరేట్లకు అమ్మకాన్ని ఆపాలి. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్‌తో సహా ఇతర అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలను వెంటనే ఆపాలి, ఉపాధి హామీ పనిదినాలు, వేతనాలు పెంచాలి, పట్టణ ఉపాధి హామీ పథకం తీసుకురావాలి, అందరికీ ఉచిత, సార్వత్రిక కరోనా టీకాను వేగవంతం చేయాలి, ఆదాయ పన్ను చెల్లించని అన్ని కుటుంబాలకు నెలకు రూ .7,500 ఇవ్వాలి, ప్రతి నిరుపేద కుటుంబాలకు నెలకు 10 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయాలి'' వంటి డిమాండ్లతో ఆందోళన జరిగింది.
సింఘూ సరిహద్దు వద్ద ఏఐకేఎస్ భారీ ర్యాలీ
క్విట్ ఇండియా డే సందర్భంగా 'సేవ్ ఇండియా' నినాదంతో వెయ్యి మందికి పైగా రైతులు ఏఐకేఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ మానవహారం నిర్వహించారు. సోమవారం వందలాది మంది రైతులు ఎర్ర జెండాలతో ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘూ సరిహద్దు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావాలే, సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్, కోశాధికారి పి కృష్ణప్రసాద్, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు విపి సాను, ఆల్ ఇండియా చెరకు రైతు సమాఖ్య అధ్యక్షుడు డి. రవీంద్రన్, ఏఐకేఎస్ తమిళనాడు అధ్యక్షుడు సుబ్రమణ్యం, సంయుక్త కార్యదర్శులు తులసి నారాయణ్, డిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.
జంతర్ మంతర్ వద్ద మహిళ సంఘాలు ఆందోళన
క్విట్ ఇండియా డే సందర్భంగా మహిళా సంఘాల ఆందోళన చేప ట్టాయి. సోమవారం జంతర్ మంతర్వద్ద ఐద్వా, ఎఫ్ఐడబ్ల్యూ, ఎఐఎంఎస్‌ఎస్, సీఎస్‌డబ్ల్యూ, స్వస్తిక్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా కన్నాట్ ప్లేస్ నుంచి జంతర్ మంతర్ వరకు ప్రదర్శన నిర్వహిం చారు. ఈ సందర్భంగా దారిపొడువున మోడీ సర్కార్ భారత్ ఛోడో, బీజేపీ -ఆర్ఎస్ఎస్ చలే జావో, కిసాన్ కానూన్, లేబర్ కోడ్ రద్ద్ కరో, అంబానీ-అదానీ కో దేశ్ బెచ్నా బంద్ కరో అంటూ నినాదాల హౌరెత్తించారు. ఈ ప్రదర్శనలో ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, ఎఫ్ఐడబ్ల్యూ ఢిల్లీ కార్యదర్శి దీప్తి, పిఎంఎస్ నాయకురాలు పూనమ్ కౌశిక్, ఎఐఎంఎస్‌ఎస్ నేత శారద, ఎస్ఎంఎస్ నేత కుసుమ్ సైగల్, సిఎస్డబ్ల్యు నేత జ్వోతి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కోశాధికారి ఎస్. పుణ్యవతి, ఐద్వా ఢిల్లీ అధ్యక్ష, కార్యదర్శులు మోమూనా మొల్లా, ఆశా శర్మ , సిఈసి సభ్యురాలు సర్బానీ సర్కార్ తదితరులు పాల్గొన్నారు.
అద్భుత స్పందన
సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, ఇండిపెండెంట్ ఫెడరేషన్లు, అసోసియే షన్ల సంయుక్తంగా ఇచ్చిన ''సేవ్ ఇండియా డే'' పిలుపుకు అద్భుత స్పందన లభించింది. లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ వేలాది మంది కార్మికు లు, ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రదేశాలలో ఊరేగింపులు, ప్రదర్శనలు, ధర్నాలు, పికెటింగ్, లంచ్ అవర్ నిరసనలు, బ్యాడ్జ్ ధరించడం, నినాదాలు హౌరెత్తిం చడం మొదలైన ఆందోళనలు జరిగాయి. కొన్ని చోట్ల కార్మికులు, రైతులు సం యుక్తంగా నిరసన నిర్వహించారు. ఆయా సంఘాలు పార్లమెంటుకు మార్చ్ నిర్వహించాయి. మండి హౌస్ వద్ద ప్రారంభమైన ప్రదర్శనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయా సంఘాలు అక్కడే ఆందోళన చేపట్టాయి. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్కౌర్, హర్భజన్ సింగ్ (హెచ్ఎంఎస్), రాజీవ్ డిమ్రి (ఏఐసీసీటీ యూ), అశోక్ ఘోష్ (యూటీయూసీ), జెపి సింగ్ (ఎల్పిఎఫ్), అనురాగ్ (సీఐటీయూ), సంతోష్ (ఎంఈసీ), శ్రీనాథ్ (ఐసీటీయూ), ధీరేంద్ర శర్మ (ఏఐటీయూ) తదితరులు పాల్గొన్నారు. ఈ కాలంలో 140 బిలియనీర్లు మార్చి 2020 నుంచి 2021 వరకు 12.94 లక్షల కోట్లు సంపాదించారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ ప్రయివేటీకరిస్తు న్నదని విమర్శించారు. తయారీ పరిశ్రమలు, బీపీసీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, స్టీల్, బొగ్గు, విద్యుత్, సేవల, రైల్వే, ఎయిర్ ఇండియా, విమానాశ్రయాలు, బ్యాంకులు, ఎల్ఐసీ, జీఐసీ, వ్యవసాయ గిడ్డంగులు వంటివి ప్రయివేటీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు.