Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రహ్లాద్ జోషికి ప్రధాని ఆదేశం
న్యూఢిల్లీ : ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ (రేషనలైజేషన్, సర్వీస్ కండిషన్స్) ఆర్డినెస్స్ 2021పై రాజ్యసభలో సోమవారం ఓటింగ్ సమయంలో బీజేపీ ఎంపీలు గైర్హాజరుపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరు అయిన బీజేపీ ఎంపీల జాబితా తయారు చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆదేశించారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే తీర్మానం వీగిపోయి వాయిస్ ఓటు ద్వారా బిల్లు ఆమోదం పొందింది. ఈ ఓటింగ్ సమయంలో కనీసం 20 మంది ఎంపీలు గైర్హాజరయ్యారని అధికారులు చెబుతున్నారు. కాగా, మంగళవారం సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీలకు ప్రధాని సూచించారు. అలాగే తమ నియోజకవర్గాల్లో క్రికెట్‌ను మాత్రమే కాకుండా అన్ని క్రీడలను ప్రోత్సహించాలని ఎంపీలకు తెలిపారు.