Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల్లూరు : సీపీఐ(ఎం) సీనియర్ నేత జక్కా వెంకయ్య కుమారుడు జక్కా అశోక్ (67) కన్నుమూశారు. సోమవారం రాత్రి ఒంటిగంట సమయంలో నెల్లూరులోని పీపీసీలో ఆయన తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం ప్రొటెం స్పీకర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసులరెడ్డి, సీపీఐ(ఎం) ఇతర నాయకులు, రూరల్, నగర కార్యదర్శులు జక్కా అశోక్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.జక్కా అశోక్ 1975లో ఎస్ఎఫ్ఐలో చేరారు. నాయకుడిగా విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. కొత్త కార్యకర్తలను తయారు చేసి, ఉద్యమంలో భాగస్వాములను చేశారు. సీపీఐ(ఎం) కార్యకర్తలను తయారుచేయడంలో విశేష కృషి చేశారు. లా కోర్సు పూర్తి చేసిన ఆయన పార్టీ సూచనల మేరకు న్యాయవాద వృత్తిని ఎంచుకొని, లాయర్‌గా పేదల పక్షాన నిలబడ్డారు. లాయర్ వత్తిలో ఉంటూనే ఐలులో సభ్యులుగా పనిచేశారు. తుదిశ్వాస వరకు ఆయన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తూ సీపీఐ(ఎం) సభ్యునిగా కొనసాగారు. ఆయన మృతికి ఏపీ, తెలంగాణ సీఐటీయూ, ఐలూ, జేవీవీ, ఐద్వా నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు.