Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌సభలో కేంద్రమంత్రి భగవత్ కిషనరావు కరడ్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటీకరణ జరిగితే, ఆయా సంస్థల్లో రిజర్వేషన్లు వర్తించవని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగత్ కిషన్‌రావు కరడ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)ల్లో 2020 మార్చి 31 వరకు 9,19,479 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. అందులో ఎస్సీలు 1,60,384 (17.44 శాతం) మంది, ఎస్టీలు 99,693 (10.84 శాతం) మంది, ఓబీసీలు 1,98,581 (21.59 శాతం) మంది ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్నారని తెలిపారు.డిజిన్వెస్ట్‌మెంట్ విషయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం) నోడల్ డిపార్ట్మెంట్ కావడంతో రిజర్వేషన్ పాలసీ ప్రభుత్వ కంపెనీల్లో మాత్రమే వర్తిస్తుందని తెలిపా రు.భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)లో వ్యూహాత్మక పెట్టుబడుల తరువాత, అది ప్రభుత్వ సంస్థగా ఉండదని తెలిపారు.