Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ జైళ్లలో దాదాపు 4.7 లక్షల మంది ఖైదీలు ఉండగా, వారిలో కేవలం 22 వేల మందికి మాత్రమే కరోనా టీకాలు అందాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఖైదీలకు టీకాలు వేసిన వివరాలను పార్లమెంట్లో వెల్లడించారు. ఇప్పటివరకు (ఆగస్టు 4) మొత్తం 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 22,345 మంది ఖైదీలకు మాత్రమే పూర్తి కరోనా టీకాలు వేయడ్డాయి. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఖైదీలందరికీ టీకాలు అందిస్తామని మంత్రి తెలిపారు. కాగా, 2019లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2019 డిసెంబర్ 31 నాటికి దేశంలోని వివిధ జైళ్లలో మొత్తం 4,78,600 మంది ఖైదీలు నిర్బంధంలో ఉన్నారు. అయితే, గత రెండేండ్లలో జైలు నిర్బంధంలోకి వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి.