Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్ముకాశ్మీర్ పర్యటనలో రాహుల్
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ రాష్ట్ర హోదాను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని, సక్రమంగా ఎన్నికల ప్రకియ నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. జమ్ముకాశ్మీర్ ఇప్పుడు ప్రత్యక్ష దాడిని ఎదుర్కొటుందని విమర్శించారు. జమ్ముకాశ్మీర్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా శ్రీనగర్లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ జమ్ముకాశ్మీర్ ప్రజలు పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. న్యాయవ్యవస్థ, పార్లమెంటరీ, మీడియాతో సహా భారత్లో ప్రజాస్వామ్య సంస్థలపై దాడి జరుగుతుందని రాహుల్ విమర్శించారు.
జమ్ముకాశ్మీర్పై ప్రత్యక్షంగా దాడి జరుగుతుంటే, మిగిలిన భారత దేశంపై పరోక్షంగా దాడి జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో మీడియా స్వేచ్ఛగా తన పాత్రను పోషించలేకపోతుందని, 'ఎవరైనా స్వేచ్ఛగా రాస్తే, తమ ఉద్యోగం పోతుందనే భయం పెద్దగా ఉంది' అని రాహుల్ తెలిపారు. త్వరలోనే జమ్ము, లడఖ్ ప్రాంతాలను సందర్శించనున్నట్లు రాహుల్ వెల్లడించారు.