Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ ఎన్నికల కోసమే మోడీ సర్కార్ ప్రేమ
- బీజేపీ ప్రభుత్వానికి సమాఖ్య విధానం గురించి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? : లోక్‌సభలో సీపీఐ(ఎం) ఎంపీ ఎఎం ఆరీఫ్ నిలదీత
న్యూఢిల్లీ : ఓబీసీ బిల్లుకు సీపీఐ(ఎం) మద్దతు ఇస్తుందని ఆ పార్టీ లోక్‌సభ ఎంపీ ఎఎం ఆరీఫ్ తెలిపారు. మంగళ వారం లోక్‌సభలో 127 రాజ్యాంగ సరవణ బిల్లుపై జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరపున ఎఎం ఆరీఫ్ మాట్లాడారు. ఈ బిల్లు సహకార సమాఖ్య విధానంలో భాగమని ప్రభుత్వం చెబుతున్నదనీ, కానీ వాస్తవానికి ఈ ప్రభుత్వ విధానం సమా ఖ్య వ్యవస్థపై దాడి చేయమని తెలిపారు. బీజేపీ సమాఖ్య విధానంపై మొసలి కన్నీరు కార్చుతున్నదని విమర్శించారు. 2014 అధికారంలోకి వచ్చిన తరువాత మోడీ సర్కార్ ఇప్పటి వరకు ఏ ఒక్క విషయంలో కూడా సహకార సమాఖ్య విధానాన్ని అమలు చేయలేదని విమ ర్శించారు. కాకపోగా సహకార సమా ఖ్య విధానాన్ని ధ్వంసం చేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిం చిందని ఆరోపించారు. రైతుల చట్టాలు తీసుకొచ్చినప్పుడు సహకార సమాఖ్య విధానం ఎక్కడికెళ్లిందని ప్రశ్నించారు. వ్యవసాయ రాష్ట్ర జాబితా అని మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలు తీసుకురాకముందు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వంతోనైనా చర్చించారా? ఏ రాష్ట్రంతో కూడా సంప్రదించకుండా వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారని విమర్శించారు. నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ (ఎన్ఈపీ) తీసుకొచ్చినప్పుడు ఎందుకు సమాఖ్య విధానాన్ని మరిచిపోయారని ప్రశ్నించారు. రాష్ట్రాలకు జిఎస్టీ పరిహారం చెల్లించడంలో సమాఖ్య వ్యవస్థ మరిచి పోయారని, ఇప్పుడు ఏదో సమాఖ్య వ్యవస్థపై ప్రేమ పుట్టుకొచ్చిందని తెలిపారు.సుప్రీం కోర్టు చెప్పిన యూనియన్ ఆఫ్ స్టేట్స్ దాన్ని కూడా మోడీ సర్కార్ మరిచిపోయిందని వివరించారు. కరోనా వ్యాక్సిన్‌ను సేకరించి, అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదన్న విషయాన్ని మర్చిపోయిందా..?అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వ్యాక్సిన్ విషయంలో సుప్రీం కోర్టు కూడా సమాఖ్య వ్యవస్థ గురించి గుర్తుచేసిందని తెలిపారు. పెగాసస్‌ను ప్రయోగించి ప్రతిపక్ష పార్టీలపై దాడికి ప్రభుత్వం యత్నించిందనీ, దీన్ని సహకార సమాఖ్య విధానం అంటారా? అని ప్రశ్నించారు.ప్రజల చేత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు, పడగొట్టేందుకు గవర్నర్లను ఉయోగించడం సహకార సమాఖ్య విధానం అంటామా?అని ధ్వజమెత్తారు.ఇలా దేశ సమాఖ్య విధానాన్ని ధ్వంసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలకు ఇవి ఉదాహరణలు మాత్రమే నని అన్నారు.వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ బిల్లు ను తీసుకొచ్చిందని,అందుకే బీసీలపై ప్రేమలు చూపిస్తోందని విమర్శిం చారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, గతంలోనే ఈ బిల్లును తీసుకురావాల్సి ఉందని అన్నారు. యూపీ ఎన్నికల లక్ష్యంగానే ఈ బిల్లు, మెడికల్ కాలేజీల్లో 27శాతం ఓబీసీ రిజర్వేషన్లు ముందుకు వచ్చాయని తెలిపారు. కానీ ఇదే ప్రభుత్వం చాలా సందర్భాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిందనీ, మంత్రులు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కానీ యూపీ ఎన్నికలు వచ్చే సరికి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేందుకు ఓబీసీ రిజర్వేషన్లు పేరుతో హడావుడి చేస్తున్నారని అన్నారు. తాము దేశంలోని సామాన్యుల కోసం ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు.